నల్గొండ జిల్లా దేవరకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో లెక్చరర్ భాస్కర్ విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్నాడనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఏబీవీపీ కార్యకర్తలు అతనిపై దాడి చేసి దేహశుద్ధి చేశారు. కాలేజీ ఆవరణలోనే విద్యార్థులు, తల్లిదండ్రుల ముందే ఈ ఘటన జరిగింది. లెక్చరర్ భాస్కర్‌పై తక్షణమే కేసు నమోదు చేయాలని, కఠిన చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నాయకులు కాలేజీ ఎదుట ధర్నా చేపట్టారు. కాలేజీ యాజమాన్యం, విద్యాశాఖ అధికారులు స్పందించి విద్యార్థినులకు తగిన భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.


