నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహం తొలగింపు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. భారీ పోలీస్ బందోబస్తు మధ్య అధికారులు తెల్లవారుజామున 3.30 గంటలకు విగ్రహాన్ని తొలగించడంపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. అనుమతులు లేకుండా, ప్రభుత్వ అసైన్డ్ భూమిలో విగ్రహాన్ని ఏర్పాటు చేశారని అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే నర్సంపేటకు వెళ్లేందుకు యత్నించిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకోవడంతో రాజకీయ వేడి మరింత పెరిగింది. ఇక పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగించడంతో ఆయన చిత్రపటం ముందు సతీమణి పెద్ది స్వప్న రోదిస్తూ, తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ‘నువ్వు లేని రోజు చూడు, ఎంత అరాచకమో.. తట్టుకోలేకపోతున్నా.. ఒక్క రోజులో చూడు ఎంత ఆగమైపోయిందో’ అంటూ ఆమె ఏడ్చారు. ఫ్యామిలీ గురించి మాత్రమే కాకుండా ఎప్పుడూ ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి విగ్రహాన్ని తొలగించడం తట్టుకోలేకపోతున్నానని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.


