HomeAndhra Pradeshబంగాళాఖాతంలో వాయుగుండం: తీవ్ర తుఫాన్ గా 19న ఏపీ తీరానికి

బంగాళాఖాతంలో వాయుగుండం: తీవ్ర తుఫాన్ గా 19న ఏపీ తీరానికి

బంగాళాఖాతంలో వాయుగుండం: తీవ్ర తుఫాన్ గా 19న ఏపీ తీరానికి

అమరావతి:

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారింది. మంగళవారం నాటికి తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెంది, క్రమంగా కోస్తాంధ్ర తీరం వైపు కదలనుంది.గురువారం నాటికి తీవ్ర తుఫాన్ గా ఆవిర్భవిస్తుందని భారత వాతావరణ కేంద్రం, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించాయి. దీని ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడనున్నాయి.ఈ తుఫాన్ ఈ నెల 19వ తేదీ గురువారానికి ఏపీ తీరం వైపునకు కదిలే అవకాశం ఉండటంతో కోస్తా జిల్లాల అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం ముందస్తుగా అప్రమత్తం చేసింది. ప్రస్తుతం ఈ వాయుగుండం గంటకు 15 కి.మీ వేగంతో ఉత్తరం-వాయవ్య దిశగా కదులుతోంది. విశాఖపట్నానికి ఆగ్నేయంగా 960 కి.మీ, చెన్నైకి 800 కి.మీ, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 1,070 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది.శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల అధికారులను అప్రమత్తం చేశారు. ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు అందుబాటులోకి తెచ్చారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు పునరావాస కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు.గురు, శుక్రవారాల్లో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు-పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు నమోదు కానున్నాయి.మంగళవారం వరకు కోస్తా తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయి. సోమవారం నుంచే మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లవద్దని ఆదేశాలు జారీ చేశారు. నెల రోజుల వ్యవధిలో ఏపీ తీరాన్ని తాకనున్న మూడో తుఫాన్ ఇది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments