HomeAndhra Pradeshతిరుమల శ్రీవారికి రూపమిచ్చిన చిత్రకారుడు శ్రీనివాసన్ కన్నుమూత

తిరుమల శ్రీవారికి రూపమిచ్చిన చిత్రకారుడు శ్రీనివాసన్ కన్నుమూత

తిరుమల శ్రీవారికి రూపమిచ్చిన చిత్రకారుడు శ్రీనివాసన్ కన్నుమూత

కోవిల్పట్టి:తిరుమల తిరుపతి శ్రీవేంకటేశ్వర స్వామి వారి రూపంగా భక్తులు కొలుస్తున్న తిరుమల వేంకటేశుడికి తన కుంచెతో రూపమిచ్చిన ప్రముఖ చిత్రకారుడు శ్రీనివాసన్ కన్నుమూశారు. తమిళనాడులోని కోవిల్పట్టిలో వృద్ధాప్యంతో ఆయన మృతి చెందారు.తమిళనాడుకు చెందిన శ్రీనివాసన్ పదో తరగతి వరకు చదివి, ప్రముఖ చిత్రకారుడు కొండయ్య రాజు వద్ద చిత్రకళలో శిక్షణ పొందారు. ఆయన ప్రతిభను గుర్తించిన తిరుమల తిరుపతి దేవస్థానం 1970లో ప్రత్యేకంగా ఆయనను ఆహ్వానించింది. గర్భగుడిలోని మూలవిరాట్టును నేరుగా దర్శించి, స్వామివారి దివ్య రూపాన్ని ఆయన చిత్రించారు.స్వామివారు సర్వాభరణాలతో అలంకరించుకున్న రూపం ఒకటి, ఆభరణాలు లేకుండా ఉన్న నిరాడంబర రూపం మరొకటి.. ఇలా రెండు రకాల అద్భుతమైన చిత్రాలను ఆయన గీశారు. ఈ చిత్రాలు అనతికాలంలోనే భక్తుల్లో విశేష ప్రాచుర్యం పొందాయి. నేడు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా దాదాపు ప్రతి ఇంట్లో, వ్యాపార సంస్థలో కనిపించే శ్రీవారి చిత్రం శ్రీనివాసన్ గీసిందే. వేంకటేశ్వరస్వామితో పాటు ఆయన పలు ఇతర హిందూ దేవతామూర్తుల చిత్రాలను కూడా గీసి మెప్పించారు.కోవిల్పట్టిలోని మండిత్తోప్పు రోడ్డులో ఉన్న ఆయన నివాసంలో మరణవార్త తెలియగానే పలువురు ప్రముఖులు, స్థానికులు ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. శ్రీవారి రూపానికి తన కుంచెతో శాశ్వతత్వాన్ని అందించిన శ్రీనివాసన్ మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments