HomeAndhra Pradeshఈ నెల 11 నుంచి ఆక్వాన్ తుఫాన్ - బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు

ఈ నెల 11 నుంచి ఆక్వాన్ తుఫాన్ – బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు

ఈ నెల 11 నుంచి ఆక్వాన్ తుఫాన్ – బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు

నవంబర్ 11 నుండి 16 మధ్య బంగాళాఖాతంలో ‘ఆక్వాన్’ (Akvan) తుఫాను ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు.ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సముద్ర పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడి, క్రమంగా అల్పపీడనంగా మారే సూచనలున్నాయని వాతావరణ నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుత పరిస్థితులను బట్టి ఈ అల్పపీడనం బలపడి వాయుగుండంగా, ఆ తర్వాత తుఫానుగా మారే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.ఈ తుఫానుకు ‘ఆక్వాన్’ అనే పేరును ఇరాన్ ప్రతిపాదించింది. బంగాళాఖాతంలో ఏర్పడే తుఫానులకు ముందుగా నిర్ణయించిన జాబితా ప్రకారం ఈ పేరు పెట్టనున్నారు.

తీరంపై ప్రభావం ఎలా ఉంటుంది?

అల్పపీడనం ఏర్పడిన తర్వాతే తుఫాను తీవ్రత, అది ఏ తీరం వైపు కదులుతుంది, ఏ ప్రాంతాలపై ప్రభావం చూపుతుంది అనే విషయాలపై స్పష్టత వస్తుందని వాతావరణ శాఖ (IMD) నిపుణులు వెల్లడించారు. ప్రస్తుతం IMD దీనిని నిశితంగా పరిశీలిస్తోంది.తుఫాను ఏర్పడితే ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో వర్షాలు, బలమైన గాలుల ప్రభావం ఉండే అవకాశం ఉందని అంచనా. మత్స్యకారులు, తీర ప్రాంత ప్రజలు వాతావరణ శాఖ హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనించాలని అధికారులు సూచిస్తున్నారు.

ముందస్తు జాగ్రత్తలు:

సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని, అధికారిక ప్రకటనలు వచ్చే వరకు వేచి చూడాలని నిపుణులు చెబుతున్నారు. తుఫాను దిశ, వేగంపై రానున్న రోజుల్లో మరింత స్పష్టమైన సమాచారం అందనుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments