
హైదరాబాద్:
సోషల్ మీడియాలో పరిచయమైన మహిళ పేరుతో సైబర్ ముఠా కానిస్టేబుల్ ను మోసం చేసింది.గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్ కు ఫేస్బుక్ లో ‘సుకన్య రెడ్డి’ పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. అనంతరం వాట్సాప్ లో పరిచయం పెంచుకుని ట్రేడింగ్ లో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మించింది.‘డార్విన్ ఎక్స్ గ్లోబల్’ సంస్థలో తొలుత చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టించగా, లాభాలు వచ్చినట్లు నకిలీగా చూపించారు. దీంతో నమ్మిన కానిస్టేబుల్ విడతలవారీగా ఏకంగా రూ. 29.20 లక్షలు పెట్టుబడి పెట్టాడు.అనంతరం రూ. 76 లక్షల లాభం వచ్చిందని, ఆ మొత్తాన్ని విత్డ్రా చేసుకోవాలంటే మరో రూ. 12 లక్షలు ఫీజుగా చెల్లించాలని కేటుగాళ్లు డిమాండ్ చేశారు. దీంతో అనుమానం వచ్చిన బాధితుడు మోసపోయినట్లు గుర్తించి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.సోషల్ మీడియా పరిచయాలు, ఆన్లైన్ ట్రేడింగ్ లాభాల ఆశలు చివరకు లక్షల రూపాయల నష్టానికి దారి తీస్తున్నాయి. అపరిచిత వ్యక్తుల పెట్టుబడి ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.


