HomeAndhra Pradeshమాజీ మంత్రి జోగి రమేశ్ కోడలికి ప్రాణహాని ఉందా?... పోలీసులకు మహిళా కమిషన్ కీలక ఆదేశాలు

మాజీ మంత్రి జోగి రమేశ్ కోడలికి ప్రాణహాని ఉందా?… పోలీసులకు మహిళా కమిషన్ కీలక ఆదేశాలు

మాజీ మంత్రి జోగి రమేశ్ కోడలు జోగి మేఘన ప్రమాద ఘటనపై ఏపీ మహిళా కమిషన్ స్పందించింది. ఈ యాక్సిడెంట్‌పై సమగ్ర విచారణ జరిపి నిజనిజాలు బయటకు తేవాలని మహిళ కమిషన్ పోలీసులను ఆదేశించింది. అలాగే వారికి భద్రత కూడా కల్పించాలని సూచించడం జరిగింది. కాగా జోగి మేఘన, తన తండ్రితో కలసి ఈ నెల 15వ తేదీన విజయవాడ నుంచి తెలంగాణలోని కోదాడకు వస్తుండగా ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు వారి కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వారి కారు వెనుక భాగంగా పూర్తిగా దెబ్బతింది. దీనిపై మేఘన తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే ఈ ప్రమాదంపై తమకు అనుమానాలు కూడా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments