HomeAndhra Pradeshయాప్‌ల వల, వందల కోట్ల స్కామ్.. ఏపీ, తెలంగాణల్లో 15 చోట్ల ఏకకాలంలో ఈడీ మెరుపు...

యాప్‌ల వల, వందల కోట్ల స్కామ్.. ఏపీ, తెలంగాణల్లో 15 చోట్ల ఏకకాలంలో ఈడీ మెరుపు దాడులు?

తెలుగు రాష్ట్రాల్లో ఈడీ అధికారులు దాడులు నిర్వహించినట్టు తెలుస్తుంది. హైదరాబాద్, విజయవాడ సహా 15 చోట్ల ఈడీ అధికారులు ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నట్టు సమాచారం. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లు, మోసపూరిత ఇన్వెస్ట్‌మెంట్ యాప్‌ల ద్వారా సామాన్యులను టార్గెట్ చేస్తున్న అంతరాష్ట్ర ముఠాలపై ఈడీ అధికారులు దృష్టి సారించారు. ఈ తనిఖీల్లో ప్రధాన అనుమానితుల ఇళ్లు, ఆఫీసుల్లో లావాదేవీలకు సంబంధించిన రికార్డులు, బ్యాంకు పత్రాలు, డిజిటల్ పరికరాలను అధికారులు పరిశీలిస్తున్నట్టు సమాచారం. బెట్టింగ్, మోసపూరిత యాప్‌ల ద్వారా సమీకరించిన డబ్బును షెల్ కంపెనీలు, క్రిప్టోకరెన్సీ మార్గాల ద్వారా విదేశాలకు తరలించినట్లు దర్యాప్తు సంస్థ అనుమానిస్తున్నట్టు తెలుస్తుంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments