పోర్ట్ ఎలిజబెత్‌లో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ ఐదో రోజున దక్షిణాఫ్రికా జట్టు ఆస్ట్రేలియాను ఇన్నింగ్స్ 31 పరుగుల తేడాతో ఓడించింది. వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ, సఫారీ బౌలర్లు కగిసో రబాడా, వియాన్ ముల్డర్, మార్కో జాన్సెన్లు విజృంభించడంతో ఆసీస్ రెండో ఇన్నింగ్స్ 295 పరుగుల వద్ద ముగిసింది. ట్రావిస్ హెడ్ (121), స్కాట్ బోలాండ్ (40) పోరాడినప్పటికీ ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ఓటమిని తప్పించుకోలేకపోయింది. ఈ విజయంతో సిరీస్‌ను సఫారీలు 1-1తో సమం చేశారు.


