Life Insurance Surrender: ప్రతి వ్యక్తికి జీవిత బీమా అనేది చాలా ముఖ్యం. అనుకోని సంఘటన ఎదురై దూరమైనప్పుడు కుటుంబం రోడ్డున పడకుండా ఈ పాలసీ కాపాడుతుంది. అయితే, గత ఆర్థిక ఏడాదిలో ఏకంగా రూ.2.80 లక్షల కోట్లు విలువైన లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలను మధ్యలోనే సరెండర్ చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. మరి ఇలా మధ్యలోనే పాలసీలను రద్దు చేసుకోవడం వల్ల ఎంత మేర నష్టపోతారో ముందే తెలుసుకోవడం మంచిది. మరి ఆ వివరాలు తెలుసుకుందాం.


