బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ కారు లక్ష్యంగా జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించి ముంబయి క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు విచారణలో తమ వాంగ్మూలాన్ని మారుస్తూ.. టైగర్ ష్రాఫే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నట్లు వర్గాలు తెలిపాయి. పోలీసుల అనుమానం రాకుండా ఉండేందుకు సెలబ్రిటీల ఇళ్ల వద్ద వీరు ముంబయి దర్శన్ ముసుగులో రెక్కీ నిర్వహించినట్లు దర్యాప్తులో తేలింది. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.


