Tdp Janasena Party Bjp Joint Statement On APSEC Decision: ఏపీలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు SEC ప్రకటించింది. ఈ పరిణామాలపై కూటమి పార్టీల తరఫున టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీెన్ మాధవ్‌లు ఉమ్మడి పత్రికా ప్రకటన విడుదల చేశారు. వైఎస్సార్సీపీ మొదటి నుంచి స్థానిక సంస్థల ఎన్నికల్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తోందన్నారు. కోర్టుల్లో పిటిషన్లు వేసి ప్రయత్నాలు చేసిందని.. కుట్రలు, కుతంత్రాలు చేస్తూనే ఉందన్నారు. కూటమి పార్టీలుగా SEC తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటామని ప్రకటించారు.
ఏపీలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియకు బ్రేక్.. ‘మేం కట్టుబడి ఉంటాం’ అంటూ కూటమి పార్టీల కీలక ప్రకటన
RELATED ARTICLES


