అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్ 2027 షెడ్యూల్‌ను ఐసీసీ బుధవారం (అక్టోబర్ 21) ప్రకటించింది. జనవరి 21 నుంచి ఫిబ్రవరి 6 వరకు బంగ్లాదేశ్, నేపాల్ సంయుక్తంగా ఈ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనున్నాయి. మొత్తం 16 జట్లు పాల్గొనే ఈ టోర్నీలో, వరుసగా రెండు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన భారత జట్టు.. తన తొలి మ్యాచ్‌లో జనవరి 22న వెస్టిండీస్‌తో తలపడనుంది. టైటిల్ ఫేవరెట్‌గా భారత్ మరోసారి బరిలోకి దిగనుంది.


