ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికల్లో అధికార ఎన్డీయే కూటమి, ప్రతిపక్ష వైసీపీ మధ్య ఘర్షణ వాతావరణం నెలకుంది. పలుచోట్ల నామినేషన్ల సందర్భంగా గొడవలు, కొట్లాటలు చోటుచేసుకుంటున్నాయి. తమ పార్టీ నేతల నామినేషన్లను ఉద్దేశపూర్వకంగానే తిరస్కరిస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. స్క్రూటినీ పేరుతో వైసీపీ లీడర్లని పిలిపించి టీడీపీ నాయకులు దాడులకు దిగారని ఆయన ఆరోపణలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తాము అధికారంలోకి వచ్చాక వాళ్ల అంతుచూస్తామని చెప్పారు.
కౌన్సిలర్‌కి ఓ ఎమ్మార్పీ.. సర్పంచ్‌కు మరో రేటు.. టీడీపీ ఎమ్మెల్యేపై వైసీపీ నేత హాట్ కామెంట్స్
RELATED ARTICLES


