ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. రిజర్వేషన్ల ప్రకటనకు, నామినేషన్ల ప్రారంభానికి మధ్య తగిన వ్యవధి ఇవ్వలేదని ఆరోపించారు. టీడీపీ శ్రేణులు తమ అభ్యర్థులను అడ్డుకుంటున్నాయని, ఆర్వోలు నామినేషన్లు స్వీకరించడం లేదని విమర్శించారు. ఎస్ఈసీ ప్రభుత్వ ఒత్తిడికి లోబడి పనిచేస్తోందని ఆరోపిస్తూ.. గతంలో తమ హయాంలో జరిగిన స్థానిక ఎన్నికల ఫలితాలను గుర్తుచేశారు. ఎన్నికల్లో అన్ని పార్టీలకు సమాన అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ కనుసన్నల్లో ఎస్ఈసీ.. నామినేషన్లకు కూడా వేయనీయటం లేదు.. చంద్రబాబు సర్కారుపై జగన్ ఫైర్
RELATED ARTICLES


