బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో భారత్ – వెస్టిండీస్ మధ్య జరుగుతున్న నిర్ణయాత్మక ఐదో టీ20 మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించింది. టాస్ గెలిచిన విండీస్ బౌలింగ్ ఎంచుకోగా, వర్షం కారణంగా మ్యాచ్ను 9 ఓవర్లకు కుదించారు. బ్యాటింగ్లో ఇషాన్ కిషన్ (30), నమన్ ధీర్ (24*) చెలరేగడంతో భారత్ 7.4 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. ఈ సమయంలో మళ్లీ వర్షం కురవడంతో ఆట నిలిచిపోయింది. ఎంతకీ తగ్గకపోవడంతో మ్యాచ్ రద్దు చేసినట్లు అంపైర్లు ప్రకటించారు.


