Tata Nexon Sales September: టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్ 2026 సెప్టెంబరులో 68810 ప్యాసింజర్ వాహనాల్ని విక్రయించి వార్షిక ప్రాతిపదికన 15.32 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ నెలలో విక్రయాల్లో పంచ్ను నెక్సన్ దాటేసి టాప్లో నిలిచింది. ఇంకా సియరా, కర్వ్ కూడా మంచి వృద్ధిని నమోదు చేశాయి. మరోవైపు టాటా టియాగో, హ్యారియర్, ఆల్ట్రోజ్ అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. దేశీయ ప్యాసింజర్ వెహికిల్ మార్కెట్ కూడా సుమారు 21 శాతం పెరిగింది.


