ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో జరుగుతున్న ఘర్షణలపై కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చాలా ఘాటు రియాక్ట్ అయ్యారు. ఎంతో శాంతియుత వాతావరణంలో జరగాల్సిన ఎన్నికలు హింసాత్మకంగా మారడంపై మండిపడ్డారు. ప్రతీకార రాజకీయాలతో రతనాల సీమను రక్తసీమగా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ రిపీట్ కాకుండా చూడాలని ఎన్నికల సంఘాన్ని ఆమె కోరారు. పటిష్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయానలి, అర్హతలున్న ప్రతి ఒక్కరికీ నామినేషన్ వేసే అవకాశం కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు.
అన్నపూర్ణలాంటి ఆంధ్రప్రదేశ్ని మరో ‘సౌత్ బీహార్’గా మార్చేస్తున్నారు.. టీడీపీ, వైసీపీలవి ప్రతీకార రాజకీయాలు : ఏపీ కాంగ్రెస్ నాయకురాలు వైఎస్.షర్మిల
RELATED ARTICLES


