Gold Mutual Fund Investment: పండగ సీజన్కు ముందు గోల్డ్ ఈటీఎఫ్లో పెట్టుబడులు పెట్టే వారికి సడెన్ షాక్ తగిలింది. ఇందులో పెట్టుబడుల్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు కొన్ని ప్రముఖ మ్యూచువల్ ఫండ్ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పటికే ఉన్న పెట్టుబడుల్ని వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ నిర్ణయం వెనుక కారణాల్ని సంస్థలు వెల్లడించకపోయినా, బంగారంలో పెట్టుబడుల ప్రవాహాన్ని నియంత్రించే చర్యగా భావిస్తున్నారు.


