Jio Satellite Services: భారత్లో స్టార్లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల ప్రవేశం గురించి కొద్దిరోజులుగా వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఇక్కడ నేరుగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీని లక్ష్యంగా చేసుకొని ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ విమర్శలు గుప్పించారు. తమ స్టార్లింక్ సేవల్ని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో దీనిపై రిలయన్స్ స్పందించింది. ఏ కంపెనీనైనా తాము స్వాగతిస్తామని, పోటీకి తామెన్నడూ భయపడలేదని స్పష్టం చేసింది.


