ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల హడావిడి మొదలైపోయింది. నామినేషన్ల తొలిరోజే అన్నమయ్య జిల్లాలో దారుణ పరిస్థితి నెలకొంది. రాయచోటి, పుంగనూరులో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఒకరిపై మరొకరు దాడులకు దిగాయి. రాయచోటీలో ఆందోళనకారులు కొన్ని వాహనాలకు నిప్పంటించారు. మరికొన్ని చోట్ల వాహనాలు ధ్వంసమయ్యాయి. రాంజపేట ఎంపీ పీవీ మిథున్ రెడ్డి పార్టీ అభ్యర్థులతో కలిసి నామినేషన్ల కోసం వెళ్తుండగా టీడీపీ వర్గీయులు దాడి చేసినట్టు వైసీపీ ఆరోపిస్తుంది. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేసింది.
ఏపీ స్థానిక ఎన్నికలు : నామినేషన్ల తొలిరోజే పుంగనూరు, రాయచోటిలో తీవ్ర ఉద్రిక్తత.. టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణలు
RELATED ARTICLES


