దసరా శరన్నవరాత్రుల సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మకు శ్రీకాకుళానికి చెందిన భక్తుడు బంగారు కిరీటాన్ని సమర్పించారు. సుమారు రూ.75 లక్షల విలువైన ఈ కానుక 494 గ్రాముల బంగారంతో తయారైంది. ఎరుపు, నీలం, తెలుపు, ఆకుపచ్చ రంగుల రాళ్లతో అలంకరించిన ఈ కిరీటాన్ని ఆలయ అధికారులు స్వీకరించారు. కానుక సమర్పించిన అనంతరం దాత కుటుంబ సభ్యులకు ప్రత్యేక దర్శనం కల్పించి, వేదాశీర్వచనం అందించారు.
విజయవాడ దుర్గమ్మకు శ్రీకాకుళం భక్తుడి బంగారు కిరీటం.. రూ.75 లక్షల విలువైన 494 గ్రాముల స్వర్ణ కానుక
RELATED ARTICLES


