Venu Srinivasan Tata Trustee: టాటా గ్రూప్లో కొంత కాలంగా విభేదాలు, ఆధిపత్య పోరు నెలకొన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా టాటా సన్స్ లిస్టింగ్ను, టాటా ట్రస్ట్స్ అధినేత నోయెల్ టాటా వ్యతిరేకిస్తున్నారు. ఇంకా టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ నియామకం పొడిగింపు నిర్ణయంపైనా ఆగ్రహంతో ఉన్నారు. ఇదే సమయంలో వేణు శ్రీనివాసన్, విజయ్ సింగ్ చేసిన ఫిర్యాదుల నేపథ్యంలో నోయెల్ టాటా తాజాగా బాంబే హైకోర్టులో కేవియట్ దాఖలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.


