విజయనగరం జిల్లా కాకరాపల్లి గ్రామానికి చెందిన సంతోష్ కుమార్ సోషల్ మీడియాలో పెట్టిన వీడియో అందరినీ కన్నీరు పెట్టిస్తుంది. విదేశాల్లో పని కోసం వెళ్లిన సంతోష్ కుమార్ కంబోడియాలో అగంతకుల చేతుల్లో చిక్కుకున్నారు. తన పాస్‌పోర్ట్, ఫోన్ లాక్కుని చిత్ర హింసలకు గురి చేస్తున్నారు. దాంతో సంతోష్ కుమార్ తనను ఎలాగైనా ఆ చెర నుంచి తప్పించి.. ఏపీకి రప్పించాలని మంత్రి నారా లోకేశ్‌కు మొరపెట్టుకుంటూ వీడియో చేశాడు.అతడిని సురక్షితంగా ఇక్కడకు రప్పించాలని అతని కుటుంబ సభ్యులు కూడా కోరుకుంటున్నారు.
“పాస్‌పోర్ట్ లాక్కుని చిత్రహింసలు పెడుతున్నారు”.. కంబోడియాలో తెలుగు యువకుడి నరకయాతన.. కాపాడాలంటూ మంత్రి లోకేశ్‌కు కన్నీటి విజ్ఞప్తి
RELATED ARTICLES


