IT Stocks Rally: వరుస సెషన్లలో భారీ నష్టాల తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు అక్టోబర్ 13న బలంగా పుంజుకున్నాయి. తొలి నుంచీ లాభాల్లోనే ట్రేడయిన సూచీలు ఆఖరి గంటలో ఆకాశమే హద్దుగా దూసుకెళ్లాయి. ఈ క్రమంలోనే మంగళవారం సెషన్లో సెన్సెక్స్ ఏకంగా 1100 పాయింట్లకుపైగా పెరగ్గా, నిఫ్టీ 22700 మార్కు ఎగువన స్థిరపడింది. ఇక్కడ ఐటీ స్టాక్స్ భారీగా పుంజుకోవడం, LTCG, STT పై కేంద్ర ఆర్థిక మంత్రి కీలక వ్యాఖ్యలు చేయడం, రూపాయి పుంజుకోవడం సహా మరికొన్ని కారణాలు ఉన్నాయి. చాలా వరకు ఐటీ స్టాక్స్ ఒక్క సెషన్లో 5 శాతానికిపైగా ఎగబాకాయి.


