HomeTELANGANAహైదరాబాద్‌లో వైరల్ జ్వరాల విజృంభణ.. ఆసుపత్రులకు పెరిగిన రోగుల తాకిడి.. డాక్టర్ల కీలక సూచనలు

హైదరాబాద్‌లో వైరల్ జ్వరాల విజృంభణ.. ఆసుపత్రులకు పెరిగిన రోగుల తాకిడి.. డాక్టర్ల కీలక సూచనలు

హైదరాబాద్‌లో వైరల్ జ్వరాలు, ఇన్‌ఫ్లుయెంజా, శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల లక్షణాలతో ఆసుపత్రులకు వస్తున్న రోగుల సంఖ్య పెరుగుతున్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించడం తీవ్ర కలవరపాటుకు గురి చేస్తోంది. వాతావరణ మార్పుల నేపథ్యంలో చిన్నారులు, వృద్ధులు, గర్భిణులు, ఆస్తమా, మధుమేహం వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. జ్వరం, దగ్గు, గొంతునొప్పి, శరీర నొప్పులు, తీవ్రమైన అలసట వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదని పేర్కొంటున్నారు. డాక్టర్ల సలహా లేకుండా యాంటీబయాటిక్స్ వాడొద్దని హితవు పలుకుతున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments