ದక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలుగా జరగనున్న 2027 వన్డే ప్రపంచకప్‌పై మహమ్మద్ కైఫ్ ఆసక్తికర విశ్లేషణ చేశాడు. సౌతాఫ్రికా పిచ్‌లు బ్యాటింగ్‌కు అనుకూలంగా మారతాయని, కేవలం రోహిత్, కోహ్లీలపై ఆధారపడితే వరల్డ్ కప్ రాదని కైఫ్ తెలిపాడు. 2003 టోర్నీ లాగే సమిష్టిగా రాణించి, మెరుగైన బౌలింగ్, ఫీల్డింగ్ ప్రదర్శిస్తేనే భారత్ మళ్లీ విశ్వవిజేతగా నిలవగలదని స్పష్టం చేశాడు. వచ్చే ఏడాది అక్టోబర్ 2 నుంచి నవంబర్ 21 వరకు ఈ టోర్నీ అలరించనుంది.


