బెంగళూరులో వెరైటీ ఎలక్షన్ జరుగుతుంది. లావుగా, బొద్దుగా ఉండే కుక్కలకు పోటీ నిర్వహిస్తున్నారు. ఇది సాదాసీదాగా జరగడం లేదు. ఈ పోటీలో 64 కుక్కలు తలపడ్డాయి. అందులో ఇప్పుడు రెండు శునకాలు ఫైనల్కు చేరాయి. ఈ పోటీకి అక్కడ జనాల నుంచి ఊహించని రెస్పాన్స్ వస్తుంది. తమకు ఇష్టమైన శునకాన్ని గెలిపించమని మద్దతుదారులు ఆన్లైన్లో పోస్టర్లు నిర్వహించి మరీ ప్రచారం చేస్తున్నారు. దీంతో ఈ పోటీ ఇప్పుడు నెట్టింట ఒక్కటే వైరల్ అవుతుంది.


