HomeTELANGANAహైదరాబాద్ చుట్టుపక్కల డెయిరీ యూనిట్లలో టీజీ సేఫ్ తనిఖీలు.. 3.6 టన్నుల కోవా సీజ్

హైదరాబాద్ చుట్టుపక్కల డెయిరీ యూనిట్లలో టీజీ సేఫ్ తనిఖీలు.. 3.6 టన్నుల కోవా సీజ్

హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లోని డెయిరీ ఉత్పత్తుల తయారీ కేంద్రాలపై టీజీ సేఫ్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆరు తయారీ యూనిట్లు, ఒక రవాణా ప్రదేశంలో నిర్వహించిన పరిశీలనల్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పరిశుభ్రత పాటించకపోవడం, లైసెన్స్‌ ఉల్లంఘనలు, ఉత్పత్తులను సరైన ఉష్ణోగ్రతల్లో నిల్వ చేయకపోవడం వంటి అంశాలను గుర్తించారు. ఇక ఏసీ వెహికల్స్‌ లేకుండా బస్సుల్లో తరలిస్తున్న 3.6 టన్నుల కోవాను సీజ్‌ చేశారు. నిబంధనలను ఉల్లంఘించిన కొన్ని డెయిరీ యూనిట్లను మూసివేయించి.. కొన్నింటిని నోటీసులు జారీ చేశారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments