హైదరాబాద్లో భారీగా రేషన్ బియ్యం పట్టుబడటం సంచలనం రేపుతోంది. రైస్ మిల్లో అక్రమంగా నిల్వఉంచిన 36 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి పట్టుకున్నారు. బియ్యాన్ని తరలించేందుకు రెడీగా ఉన్న లారీని కూడా సీజ్ చేశారు. పట్టుబడిన బియ్యం రేషన్ బియ్యమే అని అధికారులు తనిఖీలు చేసి నిర్ధారించారు. ఆ బియ్యాన్ని సిద్ధిపేట జిల్లాలోని భారతి ఇండస్ట్రీస్ నుంచి కొనుగోలు చేసినట్లు మిల్లు యజమాని అధికారులకు చెప్పాడు. దీంతో కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేపట్టారు.


