HomeTELANGANAసుద్దాల అశోక్ తేజకు 'తెలంగాణ తెలుగు తేజం' పురస్కారం .. ఈనెల 22న ప్రదానం

సుద్దాల అశోక్ తేజకు ‘తెలంగాణ తెలుగు తేజం’ పురస్కారం .. ఈనెల 22న ప్రదానం

ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు తెలంగాణ తెలుగు తేజం సాహిత్య పురస్కారం-2026 లభించనుంది. తెలుగు భాషా సంరక్షణ సంఘం-తెలంగాణ సాహితీ సంస్థ ఏటా అందజేస్తున్న బుర్ర నర్సమ్మ-లింగారెడ్డి స్మారక రాష్ట్ర స్థాయి పురస్కారానికి ఈసారి ఆయన ఎంపికయ్యారు. ఈ నెల 22న కరీంనగర్‌లో జరిగే కార్యక్రమంలో సుద్దాల అశోక్ తేజకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. తెలుగు భాషకు తెలంగాణ మట్టిబిడ్డలు అందించిన సేవలను గుర్తించడమే ఈ పురస్కారం ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments