సీఎస్కే ఫ్రాంచైజీలో వాటా కొనుగోలుకు ధోనీ యత్నించారనే వార్తలను యాజమాన్యం ఖండించింది. అయితే గతంలో ప్రైవేట్ మార్కెట్ ద్వారా కొనుగోలు చేసిన 1 లక్షకు పైగా షేర్లు ఆయన వద్ద ఉన్నాయని తెలిపింది. వాటి విలువ ప్రస్తుతం రూ.2.6 కోట్ల నుంచి రూ.3 కోట్ల మధ్య ఉంటుందని పేర్కొంది. ఇది ఫ్రాంచైజీ మొత్తం షేర్లలో చాలా స్వల్ప భాగం. ప్రస్తుతం యూఎస్‌లో ఉన్న ధోనీ సెప్టెంబర్ 22న తిరిగొచ్చాక, సీఎస్కే కొత్త హెడ్ కోచ్ ఎంపికపై మేనేజ్మెంట్తో కీలక భేటీ నిర్వహించనున్నాడు.


