HomeAndhra Pradeshసంచలనంగా గుంటూరు బాలిక మిస్సింగ్ కేసు.. డీజీపీపై హైకోర్టు సీరియస్.. పోలీసులకు చీవాట్లు!

సంచలనంగా గుంటూరు బాలిక మిస్సింగ్ కేసు.. డీజీపీపై హైకోర్టు సీరియస్.. పోలీసులకు చీవాట్లు!

మూడు నెలల కిందట గుంటూరులో పదో తరగతి బాలిక అదృశ్యంపై కేసు నమోదయింది. అయితే, బాలికను ఒక వ్యక్తి తీసుకెళ్లాడంటూ తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇటీవల తమను పట్టుకోలేరంటూ ఆ వ్యక్తి పోలీసులు, బాలిక తల్లిదండ్రులకు సవాల్ విసరాడు. దాంతో బాలిక తండ్రి హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై ఒకరోజు బాలికను హాజరుపరచాలంటూ నేరుగా డీజీపీనే బాలికను తీసుకురావాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే, డీజీపీ సిట్ ఏర్పాటు చేయడంపై హైకోర్టు తప్పుబట్టింది. డీజీపీకి కేసు ఎలా విచారించాలో తాము చెప్పే స్థితికి తీసుకురావొద్దంటూ ధర్మాసనం ఘాటుగా స్పందించింది. దాంతో ఇప్పుడు ఈ కేసు మరింత సంచలనంగా మారింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments