శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ 114 బంతుల్లోనే 202 పరుగులు చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు. వన్డేల్లో అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు. అంతేకాకుండా అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో టెస్టుల్లో త్రిశతకం (300), వన్డేల్లో ద్విశతకం (200), టీ20ల్లో శతకం (100) సాధించిన రెండో బ్యాటర్‌గా యూనివర్స్ బాస్, విండీస్ దిగ్గజం క్రిస్ గేల్ సరసన చేరి సరికొత్త అధ్యాయాన్ని లిఖించాడు.


