HomeVideosశబరిమలలో అయ్యప్ప భక్తులకు కష్టాలు.. నీలక్కల్‌లో 10 వేల మంది పడిగాపులు!

శబరిమలలో అయ్యప్ప భక్తులకు కష్టాలు.. నీలక్కల్‌లో 10 వేల మంది పడిగాపులు!

శబరిమలలో అయ్యప్ప భక్తులకు కష్టాలు.. నీలక్కల్‌లో 10 వేల మంది పడిగాపులు!

శబరిమలలో అయ్యప్ప భక్తులకు కష్టాలు.. నీలక్కల్‌లో 10 వేల మంది పడిగాపులు!

శబరిమల: మండల దీక్ష రద్దీతో భక్తుల సంఖ్య పెరుగుతుండగా, నీలక్కల్ శివాలయం వద్ద అయ్యప్ప భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.దేవస్థానం బోర్డు, పోలీసు, రవాణా శాఖల మధ్య సమన్వయ లోపంతో రెండు రోజులుగా భక్తులు పడిగాపులు కాస్తున్నట్లు సమాచారం.సుమారు 10 వేల మంది భక్తులు బస్సుల కోసం ఎదురుచూస్తుండగా, కనీసం తాగునీరు, ఆహారం, సరైన వసతి కూడా లేక అవస్థలు పడుతున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల తర్వాతే బస్సులు ఏర్పాటు చేస్తామని అధికారులు చెబుతున్నట్లు సమాచారం.దర్శనం కోసం ఎంతో దూరం నుంచి వచ్చిన భక్తులకు ఇలాంటి ఇబ్బందులు ఎదురుకావడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. రద్దీకి తగినట్లు బస్సులు, తాగునీరు, ఆహారం, వసతి ఏర్పాట్లు చేయాలని భక్తులు కోరుతున్నారు.Tags: #Sabarimala #Ayyappa #AyyappaSwamy #Nilakkal #Devotees #MandalaDeeksha #Kerala #SabarimalaYatra #BusProblem #DrinkingWater #Food #Facilities #DevaswomBoard #Police #Transport #DevotionalNews

#ksnnewstelugu
#ksntelugunews
#ksnnews
#ksnnews9-telugu

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments