హైదరాబాద్లో గణేష్ మహా నిమజ్జనం నేపథ్యంలో ప్రభుత్వం, పోలీసులు, మెట్రో అధికారులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భక్తుల రాకపోకలకు ఇబ్బందులు తగ్గించేందుకు హైదరాబాద్ మెట్రో సేవలను అర్ధరాత్రి 1 గంట వరకు పొడిగించారు. మరోవైపు శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పలు ప్రాంతాల్లో వైన్ షాపులు, కల్లు దుకాణాలు, రెస్టారెంట్ బార్లను 24 గంటల పాటు మూసివేయాలని ఆదేశించారు. అలాగే క్యూర్ పరిధిలో ప్రభుత్వ ఆఫీసులు, స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు.


