విశాఖపట్నంలో విషాద ఘటన చోటుచేసుకుంది. లిటిన్ గార్డెన్స్ స్కూలులో యూకేజీ చదువుతున్న ఆరేళ్ల ప్రణయ్ తేజ మృతి చెందాడు. గురువారం రోజు స్కూలుకు వచ్చిన ప్రణయ్ తేజను.. హోం వర్క్ చేయలేదని టీచర్ మందలించారు. ఈ క్రమంలోనే అతని చెంపపై కొట్టారు. ఆ వెంటనే విద్యార్థి కుప్పకూలగా.. ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రణయ్ తేజ చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. మరోవైపు టీచర్ కొట్టడం వలనే తమ కుమారుడు చనిపోయాడని ప్రణయ్ తేజ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కేజీహెచ్ వద్ద ఆందోళనకు దిగారు.


