ఏషియన్ గేమ్స్ 2026 పురుషుల క్రికెట్ క్వార్టర్ ఫైనల్లో భారత్, అఫ్గానిస్థాన్ మ్యాచ్ వర్షార్పణమైంది. జపాన్‌లోని నిషిన్ వేదికగా జరగాల్సిన ఈ పోరు కుండపోత వర్షం కారణంగా ఒక్క బంతి పడకుండానే రద్దయింది. టోర్నీ నిబంధనల ప్రకారం వర్షం వల్ల మ్యాచ్ రద్దయితే ఐసీసీ ట్వంటీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న జట్టు ముందంజ వేస్తుంది. దీంతో అఫ్గాన్ కంటే మెరుగైన ర్యాంకింగ్ ఉన్న భారత్ నేరుగా సెమీఫైనల్స్‌కు అర్హత సాధించింది.


