TCS Monitoring Tool: భారత అతిపెద్ద ఐటీ సంస్థ టీసీఎస్ ల్యాప్‌టాప్‌లలో మానిటరింగ్ టూల్స్ ఏర్పాటు చేసి ఉద్యోగుల్ని ట్రాక్ చేస్తుందంటూ వస్తున్న ఆరోపణలపై కంపెనీ తాజాగా స్పందించింది. ఉద్యోగుల యాక్టివిటీని తాము ట్రాక్ చేయడం లేదని, ఉద్యోగుల ప్రైవసీని గౌరవిస్తామని స్పష్టం చేసింది. అయితే ఇక్కడ భద్రత, నెట్వర్క్ పనితీరు, డిజిటల్ అనుభవాన్ని మెరుగుపర్చడం కోసమే ఇలాంటి టూల్స్ ఉపయోగిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చింది.


