HomeTELANGANAరైతు బీమాకు బ్రేక్‌.. రూ.5 లక్షల కోసం ఎదురుచూపులు.. ఇందిరమ్మ బీమా ఎప్పుడో?

రైతు బీమాకు బ్రేక్‌.. రూ.5 లక్షల కోసం ఎదురుచూపులు.. ఇందిరమ్మ బీమా ఎప్పుడో?

తెలంగాణలో రైతు బీమా ప్రీమియం చెల్లించకపోవడంతో కొత్త బీమా కవరేజీ నిలిచిపోయింది. రైతు మరణిస్తే నామినీకి రూ.5 లక్షలు అందించే పథకం గతంలో సాధారణంగా 10 రోజుల్లో పరిహారం చెల్లించేది. ప్రస్తుతం బీమా ప్రీమియం చెల్లించకపోవడంతో మరణించిన రైతుల కుటుంబాలకు పరిహారం అందుతుందా అనే సందేహాలు నెలకొన్నాయి. ఈ ఏడాదిలో 827 మంది రైతులు చనిపోగా.. 726 క్లెయిమ్‌లు పరిష్కారమై 101 పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. రైతు బీమా పథకానికి రేవంత్ ప్రభుత్వం ముగింపు పలుకుతోందని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాను ప్రకటించినా.. వాయిదా వేయడంతో ఇప్పుడు సరికొత్త అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments