ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌ను మరింత బలోపేతం చేసేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఐఏఎఫ్ కమ్యూనికేషన్ సిస్టమ్‌ను అత్యాధునీకరించేందుకు జీశాట్-7సీ శాటిలైట్ కోసం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్‌తో రూ.2,563 కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది. ఈ స్వదేశీ ఉపగ్రహం సాఫ్ట్వేర్ డిఫైన్డ్ రేడియోల ద్వారా సుదూర ప్రాంతాల్లో ఉన్న విమానాలు, రాడార్లు, గగనతల నిఘా వేదికలు, భూమిపై ఉన్న కమాండ్ కేంద్రాల మధ్య సమాచార మార్పిడిని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది.


