తిరుమల కొండపై నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారి స్వర్ణ రథోత్సవం అత్యంత వైభవంగా సాగింది. స్వర రథంపై సతి సమేతంగా మలయప్పస్వామి వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ ఉత్సవంలో కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా పెద్దఎత్తున భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే మహిళా భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారి స్వర్ణ రథాన్ని ముందుకు లాగారు. కాగా ఇంత వైభవంగా జరిగే నవరాత్రి బ్రహ్మోత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. మళ్లీ 2027వ సంవత్సరం సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో శ్రీవారి ‘సాలకట్ల బ్రహ్మోత్సవాలు’ అత్యంత వైభవంగా జరుగుతాయి.
ముగింపు దశకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ఘనంగా శ్రీవారి స్వర్ణరథోత్సవం.. రథాన్ని లాగిన మహిళా భక్తులు
RELATED ARTICLES


