HomeTELANGANA'మీరు సభకు రావాల్సిన అవసరం లేదు సర్'.. కేసీఆర్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల విజ్ఞప్తి

‘మీరు సభకు రావాల్సిన అవసరం లేదు సర్’.. కేసీఆర్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల విజ్ఞప్తి

కేసీఆర్‌ సభకు రావాలని సీఎం సహా కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తుండగా.. బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష సమావేశంలో మాత్రం కీలక నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్ అసెంబ్లీకి హాజరుకావాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అభిప్రాయపడినట్లు హరీశ్‌రావు తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు సరిపోతారని పేర్కొన్నారు. మరోవైపు కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనా వైఫల్యాలు, హామీల అమలు వంటి అంశాలను అసెంబ్లీలో గట్టిగా ప్రస్తావించాలని పార్టీ నేతలకు కేసీఆర్‌ సూచించారు. సాగునీటి అంశంపై ప్రజా ఉద్యమానికి తానే నాయకత్వం వహిస్తానని కూడా ప్రకటించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments