Mangalagiri Panakala Swamy Hill Punugu Pilli: గుంటూరు జిల్లా మంగళగిరి పానకాల స్వామి కొండపై పునుగుపిల్లి కనిపించింది. కొండ ఎక్కుతున్న భక్తులు పునుగు పిల్లిని చూసి ఆశ్చర్చపోయారు.. వెంటనే మొబైల్లో ఫోటోలు, వీడియోలు తీశారు. పానకాలస్వామి కొండపై ప్రత్యక్షం కావడం చర్చనీయాంశమైంది. ఈ పునుగు పిల్లులు శేషాచలం, నల్లమల అడవుల్లో అరుదుగా కనిపిస్తుంటాయి. ఈ పునుగు పిల్లుల నుంచి సేకరించిన ద్రవాన్ని ప్రతి శుక్రవారం రోజు తిరుమల శ్రీవారికి అభిషేకం తర్వాత పూస్తారు.
మంగళగిరి పానకాల స్వామి కొండపై అరుదైన జంతువు ప్రత్యక్షం.. పునుగు పిల్లి అక్కడికి ఎలా వచ్చింది!
RELATED ARTICLES


