ఉమెన్స్ ఆసియా కప్ 2026 రెండో సెమీఫైనల్లో శ్రీలంక జట్టు 4 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 20 ఓవర్లలో 130/5 పరుగులు చేయగా, శ్రీలంక 18.4 ఓవర్లలోనే 134/6 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ఆఖర్లో నిలాక్షికా సిల్వా (18*), కౌశాని (10*) ధాటిగా ఆడి మ్యాచ్‌ను ముగించారు. ఆదివారం జరగనున్న ఫైనల్లో భారత్‌తో డిఫెండింగ్ ఛాంపియన్ అయిన శ్రీలంక తలపడనుంది.


