భర్తను చంపి.. పాము కాటు వల్ల చనిపోయాడు అని చిత్రీకరించేందుకు ప్రయత్నించి దొరికిపోయిన భార్యకు, ఆమె ప్రియుడికి కోర్టు మరణశిక్ష విధించింది. భర్తను గొంతు నులిమి హత్య చేసిన భార్య, ప్రియుడు.. ఆ తర్వాత పాము కాటుతో చనిపోయినట్లు నమ్మించేందుకు మృతదేహం పక్కన పామును ఉంచారు. మొదట కుటుంబ సభ్యులు పాము కాటుగా భావించినా.. పోస్టుమార్టంలో గొంతు నులిమిన ఆనవాళ్లు బయటపడటంతో కేసు మలుపు తిరిగింది. విచారణలో సేకరించిన ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా నిందితులను గుర్తించారు.


