భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను న్యూజిలాండ్ టూర్లోని ఐదు మ్యాచ్ల వన్డే సిరీస్కు దూరం పెట్టి, కేవలం టెస్టులకే పరిమితం చేయాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. పూర్తిగా ఫిట్గా ఉన్నప్పటికీ, సుదీర్ఘ ఫార్మాట్పై దృష్టి పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 6న ప్రారంభమయ్యే మూడో ఇండియా ‘ఎ’ మ్యాచ్ ఆడిన తర్వాత, అతడు నేరుగా నవంబర్ 19 నుంచి వెల్లింగ్టన్ వేదికగా జరిగే తొలి టెస్టులో బరిలోకి దిగనున్నాడు.


