30 Percent Monthly Returns Scam: త్వరగా డబ్బు సంపాదించాలన్న ఆశతో పెట్టుబడులు పెడుతున్నారా? అయితే జాగ్రత్తగా ఉండాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) హెచ్చరిస్తోంది. నెలకు 30 శాతం లాభాలు ఇస్తామంటూ వచ్చే ఆకర్షణీయమైన ఆఫర్లు నకిలీ పెట్టుబడి పథకాలు కావొచ్చని, వాటిని నమ్మి కష్టపడి సంపాదించిన డబ్బును కోల్పోవద్దని సూచించింది. నేషనల్ సైబర్ సెక్యూరిటీ మంత్ స్పెషల్ క్యాంపెయిన్ 6.O. లో భాగంగా ఈ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేసింది.


