పెళ్లిళ్లు, శుభకార్యాలు, కొత్త వ్యాపారాల ప్రారంభోత్సవాల వద్ద కొందరు ట్రాన్స్జెండర్లు భారీగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారనే ఫిర్యాదులపై డీజీపీ సీవీ ఆనంద్ సీరియస్ అయ్యారు. బెదిరింపులు, బలవంతపు వసూళ్లను అరికట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని సీపీలు, ఎస్పీలకు సూచించనున్నట్లు తెలిపారు. ట్రాన్స్జెండర్లకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఆయన ప్రస్తావించారు. ట్రాఫిక్ అసిస్టెంట్లు, హైడ్రా వంటి విభాగాల్లో పనిచేస్తున్న వారు మంచి పేరు తెచ్చుకుంటున్నారని తెలిపారు.


