హైదరాబాద్ గణేష్ నిమజ్జనంలో విషాదం చోటు చేసుకుంది. బందోబస్తు విధుల్లో ఉన్న ఎస్సై వెంకన్న.. స్కూటీ ఢీకొట్టడంతో మృతి చెందారు. ట్యాంక్‌బండ్ ఎన్టీఆర్ మార్గ్‌లోని క్రేన్ నంబర్ 2 సమీపంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో గుర్తుతెలియని స్కూటీ ఆయనను ఢీకొట్టి వెళ్లిపోయింది. ప్రమాదం తర్వాత ఆయనను కోసం ఆస్పత్రికి తరలించగా.. ప్రాణాలు కోల్పోయారు. కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితుడిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్.. ఎస్సై వెంకన్న కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.


